- – ప్రజాప్రతినిధుల జీతాలు వేతనాలు పెంపు
– కార్మికుల జీతాలు తగ్గింపా? - – సీఐటీయూ నేత అర్జున్
- – 14 వ రోజు కి చేరిన దినసరి కార్మికులు సమ్మె
- – కబడ్డీ తో నిరసన వ్యక్తం చేసిన కార్మికులు
- నవతెలంగాణ – అశ్వారావుపేట
- ఐదేళ్ళ కోసారి ప్రజాప్రతినిధులు వారి జీతాలు పెంచుకుని సాదారణ కార్మికుల దినసరి వేతనాలు తగ్గించడం ఏం న్యాయం అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన వసతి గృహాలు,ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి కార్మికుల తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మె 14 వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో గురువారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో దినసరి కార్మికులు కబడ్డీ ఆడి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ జేఏసీ నాయకులు బైట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దినసరి కార్మికులు తీసుకుంటున్న వేతనం లో కోత పెట్టి నోటి కాడ బువ్వ ను లాక్కోవద్దని నిరవధిక దీక్షలు 14 రోజులుగా చేస్తున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు కానీ,గిరిజన సంక్షేమ ఆర్థిక శాఖ మంత్రివర్యులు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. కలెక్టర్ గెజిట్ ప్రకారమే పాత పద్ధతుల్లో వేతనాలు చెల్లించాలని ప్రమాదకరం గా ఉన్న 64 జీవోను రద్దు చేయాలని,కార్మికులను పర్మినెంట్ చేయాలని పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మురహరి రఘు, బత్తుల శీను,నాగమణి,అరుణ రత్తమ్మ,కరుణాకర్,రామ లక్ష్మి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
.