Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్ఐవి రహిత సమాజాన్ని నిర్మిద్దాం..

హెచ్ఐవి రహిత సమాజాన్ని నిర్మిద్దాం..

- Advertisement -

ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ నరసింహ
నవతెలంగాణ – అచ్చంపేట
హెచ్. ఐ. వి రహిత సమాజాన్ని నిర్మించాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ  డైరెక్టర్ నరసింహ అన్నారు. గురువారం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కళాకారులు  తమ ఆట,మాట, పాటలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లైంగిక అక్రమ సంబంధాల ద్వారా, కలుషితమైన సూదులు సిరంజిల ద్వారా, హెచ్ఐవి వ్యాధి సోకుతుందన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ హెచ్ఐవి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని, తల్లికి హెచ్ఐవి ఉన్నప్పటికీ అవసరమైన మందులు వాడితే బిడ్డకు హెచ్ఐవి సోకాకుండ నివారించవచ్చు అని  సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రులో ఉచితంగా రక్త పరీక్ష లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు నాలుగు నెలలకు ఒక సారి రక్త ప్రరీక్ష లు చేయించుకోవాలని సూచించారు. హెచ్. ఐ. వి వ్యాధి పాజిటీవ్ వచ్చిన వారి వివరాలను గొప్యంగా ఉంచుతారని తెలిపారు. ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టీం లీడర్ శ్రీను, కళాకారులు యాద య్య, రాజు, మహేష్, ఎన్జీవోఎస్ అంబికా, పద్మ, సరస్వతి,నిర్మల,రజిత,యాదమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -