- Advertisement -
నవతెలంగాణ – మునుగోడు
గత రెండు నెలల నుంచి ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గురువారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉపాధి హామీ సిబ్బంది వినపత్రము అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేతనాలు సక్రమంగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ మల్లేష్ , ఇన్చార్జి ఎపిఓ ఇండ్ల నాగరాజు , టెక్నికల్ అసిస్టెంట్లు నవనీత, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -