Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్థానిక ఎన్నికల్లో దళితులకు18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. 

స్థానిక ఎన్నికల్లో దళితులకు18 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.. 

- Advertisement -

బర్రె జహంగీర్ మున్సిపల్  మాజీచైర్మన్ ..
నవతెలంగాణ – భువనగిరి

స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎస్సీ కుల గణన 2025 ప్రకారం 18 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ మాట్లాడుతూ .. 2025 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 17.43% ఉన్నారని వారికి 18 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 15% రిజర్వేషన్ కేటాయిస్తే ఎస్సీలు చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఎంసి రాష్ట్ర కన్వీనర్ స్వరూపంగా శివలింగం  దళిత ఐక్యవేదిక నాయకులు కర్తాల శ్రీనివాస్, ఇటుకల దేవేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -