జిల్లా కోర్టు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డా. బొల్లెపల్లి కుమార
నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా నా నియమాకానికి అన్ని విధాలుగా సహకారం అందించిన స్థానిక భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని జిల్లా కోర్టు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డా. బొల్లెపల్లి కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని గౌరవ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి పూలబోకె ఇచ్చి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ ద్వారా ఇచ్చిన పదవిని ప్రజలకు సంబంధించిన సమస్యలపైన, చట్టపరంగా కోర్టులో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా, సారథిగా పనిచేయాలని సూచించారని తెలిపారు.
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES