నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. విమానాశ్రయంలో బాంబు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు సందేశం అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు ఈ-మెయిల్ అందిన వెంటనే, శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పోలీసులకు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్)కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై, హుటాహుటిన రంగంలోకి దిగారు. అయితే, ఈ బెదిరింపు ఈ-మెయిల్ నిజమైనదా లేక కేవలం ఆకతాయిల చర్యా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES