Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతిక 

బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ప్రతిక 

- Advertisement -

– కళాశాల చైర్మన్  కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి 
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డిలో గల శ్రీ ఆర్యభట్ట జూనియర్ కళాశాలలో బుధవారం బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలలోని  విద్యార్థినీలు పాల్గొని తమ యొక్క నృత్య ప్రదర్శనలతో అందరిని అలరింపజేశారు చేశారు. బతకమ్మ ఆటపాటలను పాడుకుంటూ చాలా సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్  కేశిరెడ్డి గురువేందర్ రెడ్డి  పాల్గొని మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయానికి ఒక ప్రతిక అని తెలంగాణ ప్రజలుబతుకమ్మ పండుగను చాల ప్రతిష్టాత్మకంగ నిర్వహించుకుంటారు అని, బతుకమ్మ పండుగ ద్వార తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ఒక మంచి ఆదర్శాన్ని చాటుతారు అని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలోకళాశాల ప్రిన్సిపాల్  హన్మంత్ రావు,  వైస్ ప్రిన్సిపాల్  కొలిమి సురేష్ రెడ్డి , వెంకటేష్ , కోఆర్డినెట్ రవి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -