Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈరాట్వన్‌పల్లి రామాలయం–శివాలయాన్ని సందర్శించిన ఎంపీ,ఎమ్మెల్యే

ఈరాట్వన్‌పల్లి రామాలయం–శివాలయాన్ని సందర్శించిన ఎంపీ,ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
అచ్చంపేట నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఉప్పునుంతల మండలం ఈరాట్వన్‌పల్లి గ్రామంలోని పురావస్తు ప్రాధాన్యం కలిగిన రామాలయం, శివాలయంలను దర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆలయ అభివృద్ధి కోసం ఎండోమెంట్ నిధులు కేటాయించాలని ప్రజాప్రతినిధులను కోరారు. స్పందించిన వారు ఆలయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కట్టా అనంతరెడ్డి, యువజన కాంగ్రెస్ మండల ఇంచార్జ్ అంతటి శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మెడమోని భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ లింగమయ్య, శంకర్, రామచంద్రయ్య, శ్రీను రాజు, అంజి, రాములు, నరసింహ గౌడ్, లచ్చయ్య, తిరుపతయ్య, శేఖర్, గ్రామపంచాయతీ కార్యదర్శి, శేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాము, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -