Thursday, September 25, 2025
E-PAPER
Homeకరీంనగర్కడారికి కన్నీటి వీడ్కోలు..

కడారికి కన్నీటి వీడ్కోలు..

- Advertisement -

కడారిని కడసారి చూసేందుకు..హాజరైన విప్లవ అభిమానులు..
గోపాల్ రావు పల్లెలో విషాదఛాయలు..
నివాళులు అర్పించింది ప్రజాసంఘాలు నాయకులు.
ఎరుపెక్కిన  పల్లె..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి

“కడారి”ని కడసారి చూసేందుకు వచ్చిన విప్లవ అభిమానులతో పాటు ప్రకృతి సైతం కన్నీటి పర్యంతం అయింది. ప్రకృతి సైతం కడారికి కన్నీరు కార్చింది. కడారి మృతదేహాన్ని గోపాలరావు పల్లె గ్రామానికి తీసుకువచ్చినప్పటి నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విప్లవ అభిమానులతో పాటు గ్రామస్తులు, చిన్ననాటి మిత్రులు, అప్పటి తోటి ఉద్యోగులు కడారి కి అశ్రుని వాళ్ళు అర్పించారు.

మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు కడారి సత్యనారాయణ రెడ్డి మరణంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కడారి సత్యనారాయణ రెడ్డి మృతదేహం స్వగ్రామం చేరిననికి పలు పార్టీల, ప్రజాసంఘాలు నాయకులు గురువారం కడారి స్వగ్రామంలో ఆయన భౌతికఖాయానికి నివాళులు అర్పించారు. ప్రజా సంఘాల నాయకులు గాది ఇన్నయ్య, విరసం కార్యదర్శి పాణి, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నాయకురాలు పద్మతో పాటు సిపిఐ, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సత్యనారాయణ రెడ్డి కి నివాళులు అర్పించి ఆయన ప్రజల కోసం చేసిన త్యాగాన్ని కొనియాడారు. ప్రజా కళామండలి కళాకారులు విప్లవ పాటలు గోపాల్ రావు పల్లెలు మారుమోగాయి.

ఈ సందర్భంగా గాదే ఇన్నయ్య తో పాటు పౌర హక్కుల సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసిన హత్యాకాండ అని అన్నారు. బూటకు ఎన్కౌంటర్ లో సత్యనారాయణ రెడ్డిని చిత్రహింసలు చేసి కాల్చి చంపారని ఆరోపించారు. ముమ్మాటికి ఇది ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. అంచలంచెలుగా ప్రజా పోరాటాలలో నాలుగు దశాబ్దాలు గా ప్రజా ఉద్యమాలలోపనిచేస్తూ మావోయిస్టు కేంద్ర పార్టీలో ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. ద్రోహుల సమాచారంతో కామ్రేడ్ కడారి సత్యనారాయణరెడ్డి తోపాటు మరో కేంద్ర కమిటీ సభ్యులు రాజు ను చత్తీస్గడ్ నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ సరిహద్దుల్లో బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారని ఆరోపించారు.

విప్లవ అభిమను లు కడసారి కన్నీళ్ళతో జోహార్లు అర్పించారు. గ్రామస్తులు కడారి కి పూర్వం గ్రామంతో ఉన్న సంబంధాలను గుర్తుచేసుకుంటు కంటతడి పెట్టారు. గోపాల్ రావు పల్లి గ్రామం ఎర్రజెండాలతో రెపరెపలాడింది. ప్రజా కళామండలి కళాకారులు విప్లవ గీతాలు ఆలపించి కడారి కి జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో భారత్ బచావో జాతీయ అధ్యక్షులు, ఇన్నయ్య, విరసం నాయకులు పాణి, అమరవీరుల బంధువిత్రుల కమిటీ నాయకురాలు పద్మ కుమారి భారీ సంఖ్య లో విప్లవ అభిమానులు పాల్గొన్నారు.

నివాళులర్పించిన పలువు…

మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి కృతదేహం స్వగ్రామమైన గోపాల రూపాయలకు రావడంతో కొన్ని పార్టీల నాయకులు అభిమానులు నివాళులర్పించారు. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజబింకర్ రాజన్న, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సహా పలువురు నివాళులర్పించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -