పేదోడికి అండగా పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్
కడసారి చూపు నుంచి కర్మకాండ వరకు ముక్తీఆశ్రమ్‌లోనే
గౌరవెల్లి రాజు పార్థివ దేహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ నివాళి
నవతెలంగాణ – మల్హర్ రావు
అద్దె ఇంట్లో ఉంటూ ఆఖరి మజిలీకి అష్టకష్టాలు పడే పేదోడికి ముక్తి ఆశ్రమం భరోసా ఇస్తోంది.అద్దె ఇంట్లో ఉంటున్న కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంతిమ కార్యక్రమం ఆ అద్దె ఇంట్లో నిర్వహించేందుకు ఇంటి యజమానులు అడ్డుకుంటుంటం సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఒకరు చనిపోతే గౌరవించాల్సిన పరిస్థితులు ఉన్నా కట్టుబాట్లు, ఆచారాల పేరుతో పేదోడిని ఇబ్బందులకు గురి చేసిన సందర్బాలుఉన్నాయి. మంథని నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు తమ కుటుంబ సబ్యుడు చనిపోతే అద్దె ఇంట్లో ఉంటలేక చివరకు పార్థివ దేహాన్ని రోడ్డుపైనే ఉంచిన సందర్బాలు అనేక ఉన్నాయి.
పేదోడి ఆఖరి మజిలీకి కుటుంబసభ్యులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పుట్ట లింగమ్మ చారిటబుల్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని బస్ డిపో సమీపంలో ముక్తి ఆశ్రమం నిర్మించారు. అద్దె ఇంట్లో ఉంటూ ఎవరైన చనిపోతే వారి అంతిమ సంస్కారాలతో పాటు కర్మకాండ పూర్తి చేసుకునే వరకు ఈ ముక్తి ఆశ్రమంలో ఉండి చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించారు. ఈ మేరకు మల్హర్ మండలం మల్లారం గ్రామానికి చెందిన గౌరవెల్లి రాజు ఓ ఇంట్లో కిరాయి ఉంటున్నారు. ఈ క్రమంలో గౌరవెల్లి రాజు మరణించగా అద్దె ఇంట్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంటి యజమాని అంగీకరించలేదు.
దీంతో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ముక్తి ఆశ్రమంలో వారి అంతిమ కార్యక్రమం చేసుకుంటున్నారు. గురువారం రాజు పార్థీవ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. ముక్తి ఆశ్రమం మీలాంటి పేదోళ్ల కోసమే ఏర్పాటు చేశామని, పేదోడి ఆఖరి మజిలీలో ఎలాంటి ఇబ్బందులు రాకూడనే ఆలోచనతో ముక్తీ ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.
ఆఖరి మజిలికి ముక్తిఆశ్రమ్.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES