ముంబై విమానాశ్రయంలో అరెస్ట్
పాస్ పోర్ట్, రెండు సెల్ఫోన్లు స్వాధీన
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
టాంజానియా దేశంలో ఉంటూ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. గురువారం వన్ టౌన్ పీఎస్ లో సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఏప్రిల్ నెలలో ఆదిలాబాద్ కు చెందిన రౌడీషీటర్ కైంచి సలీం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్ట్ పెట్టినందుకు అతనిపై రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై నిందితుడు షేక్ ఇర్ఫాన్ టాంజానియా దేశంలో ఉంటూ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిల్.సిల ఏడీబీ అనే వాట్సప్ గ్రూపు యజమానిగా వ్యవహరిస్తూ, వాట్సాప్ గ్రూపులో పోలీసులను కించపరిచేలా, ప్రజాశాంతికి భంగం కలిగించేలా విమర్శలు చేసి ఇరు వర్గాల మధ్య గొడవలు దారి తీసేలా పోస్టులు పెట్టినందుకు అతనిపై ఏప్రిల్ 15న టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని పేర్కొన్నారు.
అతను ఇతర దేశంలో ఉన్నందున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన సిఫార్సు మేరకు అతనిపై ఇమిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఘటనతో మంగళవారం టాంజానియా నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా, ఇదివరకే ఇతనిపై ఎల్ఓసి జారీ అయిన విషయాన్ని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు అతనిని పట్టుకొని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అప్పజెప్పారు. జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై పీర్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అతనిని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని వెల్లడించారు.
ఇతనిని గురువారం న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇది వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా గొడవలకు దారి తీసేలా పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సప్ గ్రూపులలో సోషల్ మీడియాలో పోలీసులను కించపరిచేలా, పోలీసు విధులకు భంగం కలిగించేలా, మనోభావాలకు దెబ్బతీసేలా పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతని వద్దనుండి ఒక పాస్ పోర్ట్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్ఐ పీర్ సింగ్, విష్ణు ప్రకాష్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టు చేసిన వ్యక్తి రిమాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES