జిల్లాలో మొత్తం 48 దుకాణాలు
గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయింపు: కలెక్టర్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలో 2025- 2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపులకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రకారం రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల కోసం రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎక్సైజ్ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో డ్రా ను గురువారం కలెక్టర్ చేపట్టారు. జిల్లాలో మొత్తం 48 దుకాణాలు ఉన్నాయని, వాటిలో గౌడ్లకు 9, ఎస్సీ లకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించామని కలెక్టర్ వెల్లడించారు. రౌండ్ల వారిగా డ్రాను తీశారు.
ఎస్సీలకు డ్రా పద్ధతిలో వచ్చిన దుకాణాల నంబర్లు 14, 28, 34, 40, 43, గౌడ్లకు డ్రా పద్ధతిలో వచ్చిన 9 దుకాణాల నంబర్లు
02,15,17,18, 33,36,38,46,48 కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
నేటి నుంచి మద్యం టెండర్ దరఖాస్తులు..
ఈ నెల 26వ తేదీన టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్లు స్వీకరించనున్నారు. అప్లికేషన్లు ఇచ్చేందుకు ఆఖరి గడువు వచ్చే నెల(అక్టోబర్) 18వ తేదీ కాగా, వచ్చే నెల 23వ తేదీన దుకాణాల లైసెన్స్ కేటాయించేందుకు డ్రా తీయనున్నారు. డిసెంబర్ 01 వ తేదీ నుంచి నూతన లైసెన్సులతో మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, సీఐలు, తదితరులు పాల్గొన్నారు.
మద్యం షాపుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES