Thursday, September 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఘనంగా బతుకమ్మ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని చించాల గ్రామాలలో గురువారం సాయంత్రం బతుక మ్మ సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. గునుగు,టేకు పువ్వు, తంగేడు, బంతి రకరకాల పూలను సేకరించి మహిళలు, పిల్లలు, బతుకమ్మలను అందంగా పేర్చి, పూజ లు చేశారు. ముందుగా హనుమాన్ మందిరంకు వెళ్లి పూజలు చేశారు. అలాగే పెద్దమ్మతల్లిమందిరం, దుర్గా మాత మండపం లో ప్రత్యెక పూజలు నిర్వహించారు. ఆనంతరం గ్రామంలో ఆయా విధుల గుండా బతుకమ్మ పాటలతో ఊరేగింపు నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు.  అంతా ఒక్కచోట చేరి బతుకమ్మ సంబురాలు చేసుకున్నారు. కోలాటాలు ,బతుకమ్మ పాటలతో  మార్మోగింది. ఆనంతరం సమీపంలోని చెరువులో బతుకమ్మలను భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -