Thursday, September 25, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసౌకర్యాల బాధ్యత మాది .. చదివే బాధ్యత మీది: మంత్రి పొన్నం

సౌకర్యాల బాధ్యత మాది .. చదివే బాధ్యత మీది: మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ లో నూతనంగా ఏర్పాటైన శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించామని, మౌలిక సదుపాయాల బాధ్యత మాదని మంచిగా చదివే బాధ్యత మీదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ లోని  శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి లో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పుస్తకాలు, కాలిక్లెటర్స్, ఇతర కిట్స్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి హాస్టల్స్ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పడిన ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి స్పెషల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అందుకు అనుగుణంగా హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్స్ కి అవకాశం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలనుకునే వారికి ఈ స్పాట్ అడ్మిషన్స్ అవకాశాన్ని వినియోగించుకోవాన్నారు.

విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని బాగా చదవాలన్నారు. ప్రపంచంలో రోజురోజుకు పోటీ తత్వం పెరుగుతుందనీ అందుకు అనుగుణంగా మీరు మరింత ఉత్సాహంగా చదవాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీకి రాష్ట్రంలోని మంచి గుర్తింపు తీసుకురావాలి చెప్పారు. ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్,ఆర్డీవో రామ్మూర్తి  ,రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్, జోనల్ ప్రెసిడెంట్ మార్గం రవీందర్ ,ఏంవీఐ లు అపర్ణ , కోల రవీందర్ ,సైదా ,ప్రత్యూష, అమృత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -