9 మందికి గాయాలు..
జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుద్దపల్లి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో బస్సులోని 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. డిచ్ పల్లి ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఒక ప్రైవేట్ బస్సు సుద్దపల్లి సమీపంలో రహదారిపై నిలిపి ఉన్న కంటెయినర్ను వెనుకనుంచి డీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న27మంది ప్రయాణికులలో 9 మందికి గ్రాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటానా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పారుఖ్, బిఎస్ రవీందర్, లింగమ్మ, అల్తాఫ్ తదితరులు న్నారు. ప్రమాదానికి కారణమైన కంటెయినర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ మోహమ్మద్ షరీఫ్ తెలిపారు.
కంటెయినర్ను ఢీకొన్న బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES