Saturday, May 10, 2025
Homeకరీంనగర్హన్మాజీపేట నూతన బ్రిడ్జిపై తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేత..

హన్మాజీపేట నూతన బ్రిడ్జిపై తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేత..

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ రూరల్: వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట నక్కవాగుపై శుక్రవారం నిర్మాణంలో ఉన్న నూతన బ్రిడ్జి వద్ద ఇరువైపుల జరుగుతున్న కాంక్రీట్ పనుల నేపథ్యంలో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రిడ్జి ఇరుప్రక్కల కూడా కాంక్రీటింగ్ పనులు కొనసాగుతున్నందున, వాహనదారుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వాహనదారుల రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను బ్రిడ్జి పక్క నుంచి ఏర్పాటు చేశారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నందున వాహనదారులు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేసి, మళ్లీ సాధారణ రాకపోకలకు అనుమతించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -