Friday, September 26, 2025
E-PAPER
Homeసినిమామా నమ్మకాన్ని నిజం చేసిన 'ఓజీ'

మా నమ్మకాన్ని నిజం చేసిన ‘ఓజీ’

- Advertisement -

”ఓజీ’ కథకి ఇంతటి భారీతనం రావడానికి కారణమైన పవన్‌ కళ్యాణ్‌కి థ్యాంక్స్‌. నేను ఆయనకు వీరాభిమానిని. ‘జానీ’ సినిమా సమయం నుంచి ఆయన్ని కలిస్తే చాలు అనుకునే వాడిని. అలాంటిది ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం, దానికి బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ‘ఓజీ’ దాదాపు మూడేళ్ళ ప్రయాణం. మొదటి రోజు నుంచి మమ్మల్ని సపోర్ట్‌ చేస్తూ, మా పక్కనే ఉంటూ మాకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసిన నిర్మాతలు దానయ్యకి, కళ్యాణ్‌కి కతజ్ఞతలు. తమన్‌, నవీన్‌ నూలి, రవి చంద్రన్‌ ముగ్గురూ ఈ సినిమాకి మూడు పిల్లర్లు లాంటివారు. వారి వల్లే సినిమా ఇంత గొప్పగా వచ్చింది. ముఖ్యంగా తమన్‌ అందరికంటే ఎక్కువగా ఈ సినిమాని నమ్మారు’ అని దర్శకుడు సుజీత్‌ అన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ ఓజాస్‌ గంభీరగా నటించిన చిత్రం ‘ఓజీ’. సుజీత్‌ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్‌ దాసరి నిర్మించిన ఈ సినిమా బుధవారం రాత్రి నుంచి ప్రత్యేక షోలతో థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఫ్యాన్స్‌, ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియాతో తమ సంతోషాన్ని పంచుకుంది. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ, ‘విడుదలకు ముందు సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమై, విజయం సాధించిన తర్వాత.. భయం, బాధ్యత పెరిగాయి. ఈ విజయంతో భవిష్యత్‌లో మరింత బాధ్యతగా పని చేస్తాం. ‘ఓజీ’ సినిమా మాది కాదు. ప్రజలు దీనిని ఓన్‌ చేసేసుకున్నారు. ఎక్కడ చూసినా ‘ఓజీ’ హంగామానే కనిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌కి ఉండే పవర్‌ అది’ అని తెలిపారు.

‘ఆనందంలో మాటలు కూడా రావడంలేదు. నేను మొట్ట మొదటిగా థ్యాంక్స్‌ చెప్పాల్సింది త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి. ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్‌ లేదు. పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు.. దర్శకుడు సుజీత్‌ పేరుని ఆయనే సూచించారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు, నాకు ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కి నచ్చే సినిమా అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రద్ధతో ఈ సినిమా చేశాం. సుజీత్‌ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ‘ఓజీ’ బ్లాక్‌బస్టర్‌ అవుతుందని తమన్‌ నమ్మకంగా చెప్పేవాడు. తమన్‌ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. నిర్మాత నాగవంశీకి ప్రత్యేక కృతజ్ఞతలు. నిజానికి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఆయన రిజిస్టర్‌ చేసుకున్నారు. కానీ, మా కోసం ఆ టైటిల్‌ ఇచ్చేశారు. ఈ టైటిల్‌ సినిమాకి ఎంతో హెల్ప్‌ అయింది. విడుదలకు ముందు అభిమానులు ‘ఓజీ ఓజీ’ అంటూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశారు. ఇప్పుడు సినిమా విడుదలై, వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేయడం సంతోషంగా ఉంది. నిర్మాత డీవీవీ దానయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -