125 మందితో జాతీయ కౌన్సిల్
తెలంగాణ నుంచి తొమ్మిది మందికి చోటు
11 మందితో జాతీయ కార్యదర్శివర్గం
31 మందితో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి రాజా మూడోసారి ఎన్నికయ్యారు. ఛండీగఢ్‌లో జరిగిన 25వ సీపీఐ జాతీయ మహాసభ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా డి.రాజాను సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. పార్టీ మహా సభ 125 మంది సభ్యుల జాతీయ కౌన్సిల్ ఎన్నిక కాగా, తదనంతరం, 11 మంది సభ్యుల జాతీయ కార్యవర్గం, 31 మంది సభ్యులతో నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఎన్నిక అయింది. 11 మంది సభ్యుల సెక్రెటేరియట్‌లో ఒక స్థానం ఖాళీ ఉంది. అమర్‌జిత్ కౌర్, డాక్టర్ బి.కె కాంగో, రామకృష్ణ పాండే, అన్నీ రాజా, డాక్టర్ గిరీష్ శర్మ, ప్రికాష్ బాబు, పి.సంతోష్ కుమార్, సంజయ్ కుమార్, పల్లా వెంకట్ రెడ్డి (తెలంగాణ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. కె రామకృష్ణ (ఆంధ్రప్రదేశ్) జాతీయ కార్యవర్గానికి ఆహ్వానితులుగా ఎన్నికయ్యారు. మిత్ర వాషు కోశాధికారిగా ఎన్నికయ్యారు. సెక్రెటేరియట్ మాజీ సభ్యుడు పల్లబ్ సేన్ గుప్తాను అన్ని జాతీయ స్థాయి కమిటీల్లో శాశ్వత ఆహ్వానితులుగా ఎన్నికయ్యారు. మరో సెక్రెటేరియట్ మాజీ సభ్యుడు కె నారాయణ కంట్రోల్ కమిషన్ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. 11 మందితో కంట్రోల్ కమిషన్ ఎన్నికయింది.
తెలంగాణ నుంచి జాతీయ కౌన్సిల్‌లో తొమ్మిది మందికి చోటు
కె. సాంబశివ రావు, పి. పద్మ, పల్లా వెంకట్ రెడ్డి, టి.శ్రీనివాసరావు, ఇ.టి. నరసింహ, బి. హేమంత్ రావు, కె. శంకర్, ఎం. బాలనరసింహ, ఎస్.కె. షబీర్ పాషా.
ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ కౌన్సిల్‌లో ఎనిమిది మందికి చోటు
కె. రామకృష్ణ, ముప్పాల నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణ మూర్తి, ఎ. వనజ, టి.మధు, జి. ఈశ్వరయ్య, పి. హరనాథ రెడ్డి, ఆర్.రవీంద్రనాథ్.