Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన-బంజారా భవనాలకు రూ.16.50 కోట్లు

గిరిజన-బంజారా భవనాలకు రూ.16.50 కోట్లు

- Advertisement -

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గిరిజనులు, బంజారాలు సామాజిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం రూ. రూ.16.50 కోట్లతో ఆరు కొత్త గిరిజన, బంజారా భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న 9 భవనాలకు అదనపు సౌకర్యాలు కల్పించేందుకు పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చామనీ, ఇందుకోసం అదనంగా రూ..6.50కోట్లు కేటాయించామని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు. గిరిజన, బంజారాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయనొక ప్రకటనలో తెలిపారు. ఇందిరాగాంధీ హయాం నుంచే కాంగ్రెస్‌ పార్టీ గిరిజనుల రిజర్వేషన్లతో పాటు వారి జీవన ప్రమాణాలను మెరుగుదలకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. అదే స్పూర్థితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు.

ఐటీడీఏ భవనాల నిర్మాణానికి రూ.30కోట్లు
ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీఏ నూతన భవనాల నిర్మాణానికి చెరో రూ.15 కోట్లు, మొత్తం రూ.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని . మంత్రి తెలిపారు. ”ఉట్నూరు, ఏటూరు నాగారం ఐటీడీఏ భవనాలు శిథిలావస్థలో ఉండటంతో వాటికి తిరిగి నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. భవిష్యత్‌లో మరిన్ని నిధులను కేటాయించటం ద్వారా గిరిజనుల విద్యా, సంక్షేమ, సాంస్కృతిక అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -