Sunday, May 11, 2025
Homeఎడిట్ పేజిఆకాంక్ష…

ఆకాంక్ష…

- Advertisement -

జరిగింది మహా దారుణమే.
మనిషన్నవాడు
ఖండించాల్సిన దుశ్చర్యే.
అయితే సమస్యకు పరిష్కారం
యుద్ధమా?

అదేమీ చిన్న విషయం కాదు
దాని పర్యవసానాలు తెలుసుగా!
అశాంతి, విభేదాలు, విద్వేషాలు
అంతర్యుద్ధాలు
ఇరువైపులా ఎన్నో నష్టాలు,
సమస్య మరింత జటిలం.

ఓ మనిషీ ఆలోచించు!
మనలో మనం గొడవలుపడే పరిస్థితిని
విచక్షణతో తిప్పికొట్టు.
స్థైర్యం కోల్పోక మంచి నిర్ణయంతో
మనిషిని మనిషిగా బతికించు.
ద్వేషాన్ని ప్రేమతో జయించు.

నా దేశమంటే
నాకు ఎనలేని ప్రేమ
నా దేశమెన్నటికీ సుభిక్షంగా
ఉండాలన్నదే నా ఆకాంక్ష.

  • శ్రీనివాస్‌ వేమూరి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -