Friday, September 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాచకొండలో 'గోల్డెన్‌' కేర్‌ ప్రారంభం

రాచకొండలో ‘గోల్డెన్‌’ కేర్‌ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-సిటీబ్యూరో
సీనియర్‌ సిటిజన్ల కోసం రాచకొండ కమిషనరేట్‌లో ‘గోల్డెన్‌’ కేర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీనియర్‌ సిటిజన్స్‌ భద్రతకు సంబంధించి రాచకొండ పోలీసులు, రాచకొండ సెక్యురిటీ కౌన్సిల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘గోల్డెన్‌ కేర్‌’ కార్యక్రమాన్ని సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సీనియర్‌ సిటిజన్లను సరిగా చూసుకోకపోయినా, భోజనం పెట్టకపోయినా, వారిని హింసించినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ గోల్డెన్‌ కేర్‌ కార్యక్రమంలో భాగంగా పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని 47పోలీస్‌స్టేషన్లకుగాను.. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలోనూ 70 సంవత్సరాలు దాటిన 10 మంది సీనియర్‌ సిటిజన్‌లను గుర్తించి ఒక డేటాను తయారు చేస్తామని తెలిపారు.

సీనియర్‌ సిటిజన్‌ల చెంతకు ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఐ, డీసీపీ, అదనపు డీసీపీ, ఏసీపీలు వారికి అనుగుణంగా ఉన్న సమయంలో వెళ్లి పలకరిస్తారని, అవరమైన సహాయం చేస్తారని చెప్పారు. సైబర్‌ నేరాలపై వివరిస్తారని తెలిపారు. మొదటి విడతలో రాచకొండ సెక్యురిటీ కౌన్సిల్‌ ప్రతినిధులతో కలిసి మొత్తం 470 మందిని గుర్తించి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, వృద్ధుల కోసం మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీ తెలిపారు. సీనియర్‌ సిటిజన్‌లు ఎవరైనా పోలీసు సేవల కోసం హెల్స్‌లైన్‌ నెంబరు 14567 లేదా రాచకొండ వాట్సప్‌ నెంబరు 8712662111ను సంప్రదించొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు పద్మజ, ప్రవీణ్‌ కుమార్‌, సునితా రెడ్డి, అక్షాంక్ష యాదవ్‌, ఇందిర, ఉషా విశ్వనాథ్‌, నాగలక్ష్మి, అరవింద్‌ బాబు, రమణరెడ్డి, మనోహర్‌, అదనపు డీసీపీలు, ఏసీపీలు, రాచకొండ సెక్యురిటీ కౌన్సిల్‌ ప్రతినిధులు శివకారడీ, సావిత్రి సూర్యనారాయణ, వృద్ధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -