Friday, September 26, 2025
E-PAPER
Homeఆటలుపెటా టీఎస్‌ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆదినారాయణ

పెటా టీఎస్‌ గౌరవాధ్యక్షుడిగా ఎమ్మెల్యే ఆదినారాయణ

- Advertisement -

కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీ ఏకగ్రీవం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం తెలంగాణ (పెటా టీఎస్‌) రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడిగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ మేరకు ఏక్రగీవంగా ఎన్నుకుంది. గురువారం సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం 2025-27కు నూతన కమిటీని సైతం ఎన్నుకుంది. అధ్యక్షుడిగా బి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పొన్నగాని కష్ణమూర్తి గౌడ్‌, కార్యవర్గ అధ్యక్షుడిగా నాగరాజు, కోశాధికారిగా శక్రు నాయక్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెటా టీఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్‌) చైర్మెన్‌ కే. శివసేనా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇటీవల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం జారె ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెటా టీఎస్‌ రాష్ట్ర కార్యవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది.

” స్కూల్‌ అసిస్టెంట్‌ ఫిజికెల్‌ ఎడ్యుకేషన్‌లకు జూనియర్‌ కాలేజ్‌లో ఫిజికల్‌ డైరెక్టర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలి. ఇన్‌సర్వీస్‌ పీఈటీ, పీడీలకు బీపీఈడీ, ఎంపీఈడీ సమ్మర్‌ వెకేషనల్‌ కోర్సులుగా ప్రవేశపెట్టాలి. పీఈటీలకు పీఏటీ పరీక్ష నిర్వహించాలి. డీపీఈడీ విద్యార్హత కలిగిన పీఈటీలకు ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోషన్‌ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 400 పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలి. స్కూల్‌గేమ్స్‌ జాతీయ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు స్పోర్ట్స్‌ కిట్స్‌ సహా టీఏ, డీఏలు మంజూరు చేయటం. మండల, జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌కు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించటం. పెటా టీఎస్‌ చొరవతో గుర్తించిన 1803 నూతన ఎస్‌ఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పోస్టులకు తక్షణమే భర్తీ చేయాలి” అని తీర్మానించారు. క్రీడల ప్రాధాన్యత, వ్యాయామ విద్య ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కషి చేస్తామని ఎమ్మెల్యేలు ఆదినారాయణ, మల్‌రెడ్డి రంగారెడ్డి, శాట్జ్‌ చైర్మెన్‌ శివసేనా రెడ్డి ఈ సందర్భంగా పెటా టీఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -