నవతెలంగాణ-హైదరాబాద్: బతుకమ్మ కుంట ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఇవాళ జరగాల్సిన కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేశారు.
హైదరాబాద్ నగరంలోని బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్దమొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లో ఉంది. దాన్ని వాహనాల పార్కింగ్ స్థలంగా వినియోగించుకునేవారు. ముళ్ల కంపలు, చెత్తాచెదారం వేసేవారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ దస్త్రాలను ఆధారాలుగా చూపారు. రంగంలోకి దిగిన హైడ్రా.. ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. అక్కడ ఎక్స్‌కవేటర్లతో తవ్వగా మీటరు లోతులోనే నీరు ఉబికివచ్చింది. దాదాపు రూ.7.15 కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టింది. పిక్నిక్ స్పాట్‌గా తీర్చిదిద్దింది. చిన్న పిల్లలు ఆడేందుకు ఆటస్థలం, వృద్ధులు సేద తీరేందుకు బెంచీలు తదితరాలు ఏర్పాటు చేసింది. చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ కట్టింది. ప్రస్తుత వర్షాలకు కుంటలో నిండుగా నీరు చేరి జలకళ సంతరించుకుంది.
బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES