నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరైనారు. ఈ సందర్బంగా బిజెపి ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు, బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరీ చేపిస్తు బానిసలుగా చూస్తున్న రోజుల్లో చిట్యాల ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విస్నూర్ దేశ్ మఖ్ ను ఎదిరించిన తెలంగాణ వీర వనిత చిట్యాల ఐలమ్మ అని అన్నారు.
రాణి రుద్రమ్మ పౌరుషన్నిపాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దు బిడ్డ చిట్యాల ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికెల చేసిందన్నారు. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శం అని, ఆడది అంటే అభల కాదు ఆది పరాశక్తి అని రుజువు చేసిన దీర మహిళా చిట్యాల ఐలమ్మ అన్నారు.
ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బిజెపి పనిచేస్తుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో ఇద్దరే మహిళలు ఖురేషి,వ్యోమిక ఉగ్రస్తావరాలను ద్వాంసం చేసి భారతీయ మహిళా నారీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి నిరూపించారని అన్నారు. నేటి మహిళలు చిట్యాల ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మి భాయ్ లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అవరోదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగోళ్ళ లక్ష్మినారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, గిరి బాబు, నాగరాజు, బుస్సాపూర్ శంకర్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.