Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోషణ మాసం మహోత్సవాల నిర్వాహనకు నిధులు మంజూరు

పోషణ మాసం మహోత్సవాల నిర్వాహనకు నిధులు మంజూరు

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
మహిళా, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజేశ్వరి నవ తెలంగాణ అచ్చంపేట : మహిళలకు శిశువులకు పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి వచ్చే నెల 16వ తారీకు వరకు ప్రతి అంగన్వాడీ సెంటర్లలో పౌష్టిక ఆహారంపై పోషణ మాస మహోత్సవాలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాల నిర్వహణకు జిల్లాకు 50, వేలు,  జిల్లాలోని  (ఐసిడిఎస్) ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ 5 ప్రాజెక్టులు ఉన్నాయి.

ఒక్కొక్క ప్రాజెక్టుకు 30 వేల చొప్పున నిధులు మంజూరైనట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి రాజేశ్వరి నవతెలంగాణతో తెలిపారు. ప్రతిరోజు అంగన్వాడి సెంటర్ల ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రభుత్వం ఆదేశించిన ప్రకారంగా జంకు ఫుడ్ వినియోగం తగ్గించడం, చక్కెర ఉప్పు, నూనెల వాడకం పరిమితంగా ఉండాలని, చిన్నపిల్లలకు మెరుగైన పౌష్టికాహారం అందించి వారి ఎదుగుదలకు సహకరించాలని గ్రామాలలో ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. గర్భిణీ మహిళలకు, పాలు ఇచ్చే తల్లులకు శిశువులు చిన్న పిల్లల పోషణ పై సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -