నవతెలంగాణ – ఆర్మూర్
ఐలమ్మ స్పూర్తితో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. పట్టణంలోని చిట్యాల ఐలమ్మ 130 జయంతిని దోబీ ఘాటులో గల చిట్యాల వీరనారి వీరనారి ఐలమ్మ విగ్రహానికి శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శితో పాటు సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి కోతాడి ఎల్లయ్యలు మాట్లాడుతూ.. చిట్యాల వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం నవాబ్ కు వ్యతిరేకంగా జమీందారులకు దొరలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించిందని అన్నారు.
ఐలమ్మ తమ వృత్తిని చేసుకుంటూనే 40 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిందని అన్నారు. ఆనాడు విష్ణు రామ్ రెడ్డి అనే దొర సాయం చేస్తావా అని అంత ఎత్తుకు పోతున్న సందర్భంలో ఆంధ్ర మహాసభ చేరి సంఘ సభ్యులతో కలిసి దొరలకు దేశ్ముక్కులకు వ్యతిరేకంగా పారాటాలు కొనసాగించిందని అన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బాంచన్ దొర కాల్ మొక్కుతా అనే దొర అహంకారాన్ని భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి, విముక్తి కోసం ఆ పోరాటం కొనసాగిందని అన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచిపెట్టిన ఘనత తెలంగాణ సాయుధ రైతన్న పోరాట చరిత్ర అని అన్నారు. తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటంలో లిస్టులో 4000 మంది బలిదానం అయ్యారని అయ్యారని అన్నారు.
నేటి పాలకులు ఆ పోరాటాన్ని వక్రీకరిస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. చిట్యాల వీరనారి సాకలి ఐలమ్మ పాలకుర్తి గ్రామంలో సంఘం శాఖను ఏర్పాటు చేసి తన ఇల్లుని కమ్యూనిస్టులకు అంకితం చేసిందని అన్నారు. ఆనాడు దేశ్ముక్కులు చిట్యాల వీరనారి ఐలమ్మ పంట పొలాన్ని కోయకుండా అడ్డుకుంటే కర్రలు బడిసెలతో ఎదురు తిరిగి వారిని తరిమి కొట్టిన చరిత్ర ఐలమ్మది అని అన్నారు.
నేడు బిజెపి పాలకులు తెలంగాణ సాయుధరైతంగా పోరాటాన్ని మత ప్రాతిపదికన చూస్తున్నారని అన్నారు. ఆనాడు ఆ పోరాటంలో వారు ఎక్కడ కనిపించ లేకుండా పోయినప్పటికీ నేడు వక్రీకరించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. సమానత్వం కోసం బడో బలహీన వర్గాల అభివృద్ధి కోసం చిట్యాల వీరనారి అయిలమ్మ స్ఫూర్తితో బలహీన వర్గాలను ఐక్యం చేసి మరిన్ని పోరాటాలకు సిద్ధం చేస్తామని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పోరాటం చేస్తున్న ఉద్యమకారులను అనచి వేయాలని చూస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలో అమలు కోసం ప్రజలందరినీ సిద్ధం చేసి పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. బతుకమ్మ చీరలు మహిళలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు తొగటి భూమేశ్వర్, ఓంకార్,రజకులు తదితరులు, పాల్గొన్నారు.