నవతెలంగాణ – కంఠేశ్వర్
టీఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఐలమ్మ జయంతి సందర్భంగా వినాయక్ నగర్లో ఆమె విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. టి ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ మాట్లాడుతూ.. భూమికోసం ,భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల, భూస్వాముల పై తిరగబడ్డ బహుజన ధీరత్వ పతాక.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి అని అన్నారు. ఐలమ్మ ఆశల కోసం బహుజన రాజాధికారం కోసం టి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు ఇటుక రాజు మాదిగ నాయకత్వం ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి దుర్గాయ్య మాదిగ, టీ ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా నాయకులు దారి హరీష్,మెండోర మండల అధ్యక్షులు పాలెం వంశిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఐలమ్మకు ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES