- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా స్థానిక వినాయక నగర్ కాలనీలో ఐలమ్మ 130 జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్, మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గంధ మల్ల నాగభూషణం, మాదిగ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణిగుంట నాంపల్లి,సిల్మల సురేష్ మాట్లాడుతూ.. నిజం సర్కార్ కు వ్యతిరేకంగా ఆరోజు భూమికోసం పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ ను నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని, ఈ సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆ కార్యక్రమంలో నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డప్పు నరసయ్య మాదిగ మల్లేష్ మాదిగ పాల్గొన్నారు.
- Advertisement -