నవతెలంగాణ -చిన్నకొడూరు
మండల పరిదిలోని మాచాపూర్ గ్రామంలో శనివారం రోజు జరిగే సద్దుల బతుకమ్మ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు సతిమణి శ్రీనిత వస్తున్న సందర్భంగా శుక్రవారం మాజీ ఎంపీపీ కూర మాణిక్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కాముని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గాజుల బాబు, మండల నాయకులతో కలిసి మాచాపూర్ లో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఇది రెండవ సద్దుల బతుకమ్మ పండుగ అని ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ ఏర్పాట్ల కోసం నయా పైసా కేటాయించలేదని అన్నారు.
గతంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగలకు నిధులు కేటాయించి ఆడపడుచులకు అందరికీ చీరల పంపిణీ చేయడంతో పాటు నిధులు విడుదల చేసి ఘాట్లు నిర్మించి, గ్రామాలలో, చెరువు కట్టపైన మహిళలకు ఇబ్బంది కలవకుండా దారిని బాగు చేస్తూ విద్యుత్తు లైట్లు ఏర్పాటు చేయడం జరిగిందని నేటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి స్థానిక ఎలక్షన్లు పెట్టకపోవడంతో గ్రామపంచాయతీలలో నిధులు లేక పొవడంతొ గ్రామాలలో పారిశుద్ధ్యం కుంటుపడిందని కనీస సౌకర్యాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, ఏలేటి వెంకట్ రెడ్డి, ఏలేటి రాజారెడ్డి, సుంచు ఎల్లయ్య,తీపిరెడ్డి వెంకట్ రెడ్డి, యాట యాదయ్య తదితరులు ఉన్నారు.
రేపు మండలంలో సద్దుల బతుకమ్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES