నవతెలంగాణ – సారంగాపూర్
నేటి తరానికి చిట్యాల ఐలమ్మ జీవితం ఒక మార్గదర్శకమని, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మునిమాన్కల లక్ష్మన్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడారు. సాయుధ పోరాటంతో పెత్తందారు అణచివేతను వ్యతిరేకిస్తూ.. సమానత్వం కోసం పోరాడిన మహా గొప్ప మహనీయురాలని కొనియాడారు. నేటి తరానికి ఆమె ఒక మార్గదర్శకమని తెలిపారు. ప్రభుత్వం రజక వృత్తిదారుల కు సంక్షేమ పథకాలు అమలు అమలుచేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల నాయకులు రమేష్, సుమన్,గంగాధర్, పోషెట్టి,భీమేశ్,సంతోష్,సంఘం సభ్యులు.గ్రామ ప్రజలు పాల్గొన్నారు.