నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో నిజామాబాద్ కమిషనరేటు కార్యాలయంలో ఐలమ్మ 130వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి , అదనపు డీ.సీ.పీ ( ఎ.ఆర్ ) కె. రామ్ చందర్ రావు, పరిపాలన అధికారి (ఏవో) ఆసియా బేగం, సైబర్ క్రైమ్ ఏసిపి వెంకటేశ్వర్లు , ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, వనజా రాణి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ , పోలీస్ కార్యాలయం సిబ్బంది , సి.సి.ఆర్.బి సిబ్బంది, సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూo సిబ్బంది , సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ శాఖ ఆద్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES