Monday, October 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంస్కరణలతో దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

సంస్కరణలతో దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జన్మదిన వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. భారతదేశాన్ని సంస్కరణలతో దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఆర్థిక నిపుణులని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, వట్నాల రమేష్, కర్రే వార్ రాములు, రచ్చ కుశాల్, దిగంబర్, బండి హనుమాన్లు, కల్లూరు అశోక్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -