Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ

మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ

- Advertisement -

– రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మహిళా చైతన్యానికి పత్రిక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. శుక్రవారం వేల్పూర్ మండల కేంద్రంలో  చాకలి(చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తి అన్నారు.

వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని కోనసాగించి ఆనాడు మనపై పెత్తనం చేస్తున్న ఆంధ్రపాలకులను ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించామన్నారు. ఇకముందు కూడా ఆమె పోరాట స్ఫూర్తిని తీసుకొని ప్రజల పక్షాన పోరాడుతామని పేర్కొన్నారు.జోహార్ చాకలి ఐలమ్మ అని నినదించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, పలువురు రజక సంఘం సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -