- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
పీసిఆర్( పూర్ణచంద్రరావు) ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొనకల్ గ్రామపంచాయతీలోని గాంధీ నగర్ లో 50 మంది మహిళలకు శుక్రవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని చీరలను అందజేసినట్లు పీ సిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ములుగు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చాకినాల భూమేష్, చింతల సతీష్, మేడిశెట్టి సత్యం, భూమా రావు పొనకల్ మాజీ ఎంపీటీసీ రాగుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -