- Advertisement -
– సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ సాహితీవేత్త, విశ్వకర్మ లెజండరీ అవార్డు గ్రహీత సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు రచించిన పరిశోధనా గ్రంధం ‘ప్రభాత సుమాలు’ కు అంతర్జాతీయ ప్రామాణిక గ్రంధ గుర్తింపు లభించింది. భారత ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని రాజారాం మోహన్ రాయ్ ఐ.ఎస్.బి.ఎన్ ఏజన్సీ నుండి శుక్రవారం ప్రభాకరాచార్యులు కు అందింది. ఈ గ్రంధాన్ని సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం ఆర్ధిక సహకారంతో ముద్రించనున్నారు. నవంబర్ 2025 లోపుగా ఈ గ్రంధం పాఠకులకు అందుబాటులోకి రానున్నట్లు గ్రంధ రచయిత ప్రభాకరాచార్యులు తెలిపారు.
- Advertisement -