నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుంకేట రవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల, కార్యకర్తల, ప్రజల తరఫున ఈరవత్రి అనిల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి తక్కురి దేవేందర్, కిషన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు పూజారి శేఖర్, నల్ల గణేష్ గుప్తా, సుంకేట శ్రీనివాస్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES