ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..
వైద్యాధికారిని డాక్టర్ షారోన్ షైనీ క్రిస్టినా..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తూన్నమని ఆస్పత్రి వైద్యాధికారిని డాక్టర్ షారోన్ షైనీ క్రిస్టినా శుక్రవారం తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ సర్జరీ, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు పాల్గొంటున్నట్లు వివరించారు. మహిళా ఫైలేరియా కేసులను, చర్మ సంబంధ వ్యాధుల తో బాధపడుతున్న రోగులను మరియు క్షయ వ్యాధిగ్రస్తులు వారి కుటుంబ సభ్యులను ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారు దగ్గు, దమ్ము, నిమోనియా లాంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే థైరాయిడ్, ఏవైనా శస్త్ర చికిత్సకి సంబంధించిన గడ్డలు ఉన్నట్లయితే ఈ శిబిరంలో ఉచిత సేవలు వినియోగించుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ షారోన్ షైనీ క్రిస్టినా కోరారు.
ఇందల్ వాయి ఆస్పత్రిలో మెగా ఉచిత ఆరోగ్య శిబిరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES