– దున్నపోతు కు వినతి పత్రంతో నిరసన
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజన వసతి గృహాలలో పనిచేస్తున్న దినసరి కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని నిర్వహిస్తున్న సమ్మె 15 వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో శుక్రవారం దినసరి కార్మికులు ‘దున్నపోతు’ కు వినతిపత్రం ఇచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ జేఏసీ నాయకులు బైట నాగేశ్వరావు మాట్లాడుతూ కలెక్టర్ గెజిట్ ప్రకారమే పాత పద్ధతుల్లో వేతనాలు చెల్లించాలని ప్రమాదకరం గా ఉన్న 64 వ జీవోను రద్దు చేయాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మురహరి రఘు, బత్తుల శీను,నాగమణి, అరుణ, రత్తమ్మ,కరుణాకర్, రామలక్ష్మి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
.