నవతెలంగాణ – చారకొండ
మండల కేంద్రంలో తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో సాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత,తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు భూమికోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం బాంచన్ దొర మొక్కుతా అనే రోజులు పోవాలని నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా వీర వనిత నేటి సమాజానికి స్ఫూర్తి అయిన మన తల్లి చాకలి ఐలమ్మ అని అన్నారు.
కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పగడాల యాదయ్య, పగడాల పాపయ్య, పగడాల శంకరయ్య,పగడాల లెనిన్, పగడాల జగదీష్, పగడాల ఆంజనేయులు, పగడాల ఆదిత్య వివిధ పార్టీ నాయకులు సిపిఐ జిల్లా నాయకులు డాక్టర్ చిరువేరు శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జమ్మికింది బాలరాం గౌడ్, మాజీ సర్పంచ్ సవారి జంగయ్య గౌడ్, సిపిఐ మండల కార్యదర్శి ఎసారపు అశోక్ గౌడ్, బీఆర్ఎస్ మండల నాయకులు కేశముని మధు గౌడ్, జెసిబీ వెంకటయ్య గౌడ్, కందికంటి సీనయ్య గౌడ్, చక్కర మహేష్ గౌడ్, కాగుల కొండలయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES