బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ
ఘనంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలు
నవతెలంగాణ – పాలకుర్తి
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా, ఆర్థిక సంస్కరణల దీశాలిగా భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పనిచేశాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ అన్నారు. భారత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి మన్మోహన్ సింగ్ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు గురువారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావుడియా మంజుల భాస్కర్ నాయక్ లతో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ .. ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసిన సేవలు మరువలేని అన్నారు. మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. పేదలకు ఉపాధి హామీ పథకాన్ని, సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చి ఎంతో మంది జీవితాల్లో నింపేందుకు మన్మోహన్ సింగ్ పాలన దోహద పడిందని కొనియాడారు. దేశానికే ప్రధానిగా బాధ్యతలు ఉన్నప్పటికీ సామాన్య జీవితాన్ని గడిపేడని తెలిపారు.
మన్మోహన్ సింగ్ స్ఫూర్తితో దేశంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనను అందిస్తుందని తెలిపారు. మన్మోహన్ సింగ్ ను ఆదర్శంగా తీసుకొని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొలుగూరి యాకయ్య గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జలగం కుమార్, మాజీ ఎంపీపీలు గడ్డం యాక సోమయ్య, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, నలమాస రమేష్ గౌడ్, నీరటి చంద్రయ్య, నారగోని ఎల్లయ్య, మంగ శోభన్ బాబు, గాదపాక ఎల్లయ్య, గడ్డం వరుణ్ బాబు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.