Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా లోకానికి ఐలమ్మ ఆదర్శం..

మహిళా లోకానికి ఐలమ్మ ఆదర్శం..

- Advertisement -
  • తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు వడ్లకొండ బిక్షపతి..
    నవతెలంగాణ – రాయపోల్
    తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదటి మహిళ ఉద్యమకారులు ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు చైతన్యవంతం కావాలని తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి మండల అధ్యక్షులు వడ్లకొండ బిక్షపతి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 130 వ జయంతి సందర్భంగా ఆమె  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశముఖ్, భూస్వాములకు ఎదురు నిలబడి భూమికోసం, భుక్తి కోసం పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఆంధ్ర మహాసభలో సభ్యులుగా ఉండి  దొరలు చేసే అఘాయిత్యాలు, ఆగడాలను, దోపిడిని ఎదిరించి తాను కౌలుకు తీసుకున్న భూమిని పంటను కాపాడుకున్న వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు.

    ఆమెను ఎదిరించే ధైర్యం లేక దొరలు నక్సలైట్ పేరుతో అక్రమ కేసులు బనాయించి వారి కుటుంబాన్ని చిత్రహింసలు చేశారని అయినప్పటికీ కూడా మడమ తిప్పకుండా దొరల గుండాలతో పోరాడి తరిమికొట్టిన ధైర్యశాలి అన్నారు. ఆమె చేసిన పోరాట స్ఫూర్తితోటి అక్రమంగా కబ్జా చేసిన పేదల భూములు దొరల వద్ద నుండి 10 లక్షల ఎకరాల వరకు దళిత బహుజనులకు భూ పంపిణీ చేశారు. చాకలి ఐలమ్మ ఆధునిక సమాజానికి నాందిగా నిలిచారని పేర్కొన్నారు. అలాంటిది ధీరవనిత రజక కులంలో పుట్టిన ఐలమ్మ నేటి సమాజానికి ఎంతో ఆదర్శవంతం అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని  దళిత బహుజన హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి గౌరీగారి పరశురాములు,నాయకులు చింతకింది మంజూరు,  పీర్లపల్లి రవి, మహేందర్, చెప్పాల స్వామి, చింత కింది మహేష్,మైసిగారి భూదవ్వ, బాలమణి, మల్లవ్వ, రామవ్వ , మల్లేష్, స్వామి, ప్రవీణ్, యాదయ్య, గణేష్,మల్లయ్య, లచ్చయ్య, లక్ష్మి,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -