Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్టీ జాబితా నుండి తొలగించాలనె కుట్రలను ఐక్యమత్యంతో తిప్పికొడతాం 

ఎస్టీ జాబితా నుండి తొలగించాలనె కుట్రలను ఐక్యమత్యంతో తిప్పికొడతాం 

- Advertisement -

రాజ్యాంగబద్ధంగానే లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారు 
లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగిస్తే ప్రళయమే 
లంబాడి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జై సింగ్ రాథోడ్ నాయక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కుట్రలను లంబాడీలు ఐక్యమత్యంతో తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని లంబాడి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ భూక్య జై సింగ్ రాథోడ్ నాయక్ స్పష్టం చేశారు. గురువారం పాలకుర్తి శివారులో గల సేవాలాల్ భవన్ లో లంబాడ జేఏసీ జిల్లా కన్వీనర్ మూడ్ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి లంబాడి జేఏసీ రాష్ట్ర నాయకులు జాటోతు కిషన్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధారావత్ శంకర్ నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ ధరావత్ కిషన్ నాయక్ లతో కలిసి జై సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగానే 50 సంవత్సరాల క్రితమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చిందని తెలిపారు.

ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడీలను కొంతమంది ఆదివాసి ద్రోహులు కుట్రలు చేస్తూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోర్టుకు వెళ్లారని అన్నారు. రాష్ట్రంలో 10 శాతం ఉన్న ఎస్టీ  లల్లో   ఏడు శాతం లంబాడీ లేనని స్పష్టం చేశారు. అన్నదమ్ము కలిసున్నా లంబాడీలను, ఆదివాసీలను విడదీసేందుకు కొంతమంది స్వార్థ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్దికోసం పాకులాడుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారని విమర్శించారు.

ఎస్టీ జాబితాలో లంబాడీలను అక్రమంగా చేర్పించలేదని, భారత పార్లమెంటులో చట్ట సవరణ ప్రకారం 1976లో ఆర్టికల్ 342 ప్రకారం ఎస్టీ జాబితాలో చేర్పించాలని స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించిన తెల్లం వెంకట్రావు, సోయం బాబురావులు ఆదివాసి తెగల ద్రోహులని అన్నారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగిస్తే రాష్ట్రంలో ప్రళయాన్ని సృష్టిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి జేఏసీ నియోజకవర్గ నాయకులు ధారావత్ జై సింగ్ నాయక్, ధరవత్ యాకూబ్ నాయక్, లావుడియా దేవేందర్ నాయక్, బానోతు రాజన్న నాయక్, ధరవత్ మహేష్ నాయక్, గుగులోతు లక్పతి నాయక్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -