- Advertisement -
- – రూ.3.21 లక్షల నగదుతో అమ్మవారి అలంకరణ
- – ఉప్పెరగూడెంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
- నవతెలంగాణ – పెద్దవంగర
- మండలంలోని ఉప్పెరగూడెం గ్రామంలో తెలంగాణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారికి శ్రీమహాలక్ష్మి దేవిగా అలంకరణ జరిగింది. రూ 3.21 లతో అలంకరించి, ఆలయ ప్రధాన అర్చకులు రాకేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీ మాలలో ఉన్న దీక్షాధారులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తీర్థప్రసాదాలను అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు చేసి, తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఆమెను పూజించడం వల్ల దరిద్రం, దుఃఖాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మిక. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణి మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం సంపత్ప్రదం. అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అర్చిస్తే ధన , కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుందని, సుఖ సంతోషాలు చేకూరుతాయనీ విశ్వాసం. కార్యక్రమంలో ఆలయ సేవా ప్రతినిధులు దుంపల జమున సమ్మయ్య, వేముల లక్ష్మి రఘు, దుంపల శ్యాం, బైన రఘుపతి, యూత్ అధ్యక్షుడు నీలం సాంబయ్య, ప్రధాన కార్యదర్శి బైన అనిల్, కళ్యాణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -