ఉపాధి పనుల అమలుపై దృష్టి పెట్టాలి
కూలీలందరికీ ఉపాధి పనుల్లో అవకాశం కల్పించాలి : ఏపీడి చంద్రశేఖర్
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేసే ఉపాధి హామీ పనుల్లో తప్పిదాలు జరిగితే సహించేది లేదని ఏపీడి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఉపాధి హామీ పనుల మండల సామాజిక తనిఖీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీడి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల అమలుపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలు లేకుండానే ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. పనులను గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి హామీ కూలీలందరికీ పనుల్లో అవకాశం కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనుల అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తప్పు చేసేవారు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ నివేదికను మండల సామాజిక తనికి కార్యక్రమంలో ప్రవేశపెట్టారు. మండలంలోని కొన్ని గ్రామాల్లో మస్టర్లు సక్రమంగా లేకపోవడం, కూలీల హాజరు సక్రమంగా లేకపోవడం వల్ల ఉపాధి హామీ ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ ల నుండి 45534 నిధులను రికవరీ చేసేందుకు ఆదేశించారు. భవిష్యత్తులో ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి తప్పిదాలు జరగకుండా నివారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవిఓ సంధ్య, క్వాలిటీ కంట్రోల్ అధికారి రాజా వర్ధన్ రెడ్డి, ఎంపీడీవో ఎస్ రవీందర్, ఏపీవో అంబాల మంజుల, ఎస్ఆర్పి కాశన్న లతోపాటు సామాజిక తనిఖీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో తప్పిదాలు జరిగితే సహించేది లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES