జిల్లా ప్రజలకు, పోలీస్ కుటుంబ సభ్యులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆట పాటలు, కోలాటాల మధ్య బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయీ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ అని ఇలాంటి వేడుకలు సాంప్రదాయ విలువలను కాపాడటమే కాకుండా, కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి అని అన్నారు. ఎక్కడైనా దేవుళ్లకు పూలు పెట్టి కొలుస్తాము, కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం ఒక తెలంగాణ లో మాత్రమే ఉందన్నారు.
తెలంగాణ సంస్కృతికి చారిత్రక చిహ్నం బతకమ్మని మరియు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి తెలిపారు. పోలీసు వారి కుటుంబ సభ్యులతో బతుకమ్మ ఆడటం ఇంత మంది కుటుంబ సభ్యులను కలిసినందుకు వారితో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్బంగా ఎస్పీ పోలీసు సిబ్బంది,వారి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సాంప్రదాయ ఉత్సాహాన్ని పంచుకున్నారు.మహిళా పోలీస్ సిబ్బంది అందరూ రంగురంగుల చీరలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో వేడుకను జరిపారు.అలాగే అందంగా,సాంప్రదాయ శైలిలో బతుకమ్మలను రూపొందించిన వారికి ప్రత్యేక బహుమతులను ప్రదానం చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ లు కృష్ణ, మొగిలి,శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి,ఏ. ఓ పద్మ,ఎస్.ఐ లు ,సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పువ్వులను పూజించడం తెలంగాణ గొప్ప సంస్కృతి: ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES