నవతెలంగాణ – రాయపర్తి
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలపై శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఆర్ఓ, ఎఆర్ఓ, పిఓలకు శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఓ, ఏపీఓలు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కల్గి ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. పోలింగ్ సందర్భంగా నిర్వహించనున్న అన్ని విషయాలపై శిక్షణ ద్వారా తెలుసుకోవాలన్నారు. ఈ ఎన్నిక ఈవీఎంల ద్వారా కాకుండా ప్రాధాన్యత ఓటింగ్ బ్యాలెట్ విధానం ద్వారా నిర్వహిస్తున్నందున పీఓ, ఏపీఓలు బ్యాలెట్ బాక్స్‌లు ఓపెన్ చేయడం, మూసివేయడం, సీలింగ్ చేసే పద్ధతి గురించి తెలుసుకోవాలన్ని వివరించారు. బ్యాలెట్ బాక్స్ ఖాళీగా ఉందని అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు చూపించిన తర్వాత పోలింగ్ కోసం బ్యాలెట్ పెట్టెను సిద్ధం చేయాలన్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, టిఓటిలు గారె కృష్ణ మూర్తి, నాగేశ్వర్ రావు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వినోద్ కుమార్, మహేందర్, శాంతిరాజ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES