తాడిచెర్ల జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి..
నవతెలంగాణ – మల్హర్ రావు
విద్యార్థులకు నాణ్యత విద్యను అందించి,వందశాతం ఉత్తీర్ణత సాధించడమే తమ లక్ష్యమని తాడిచెర్ల జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి అన్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు శుక్రవారం ప్రిన్స్ పాల్ అధ్యక్షతన కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల హాజరుశాతం,చదువుపై అవగాహన,అధ్యాపకుల సలహాలు, సూచనలు, విద్యార్థుల తల్లిదండ్రుల సలహాలు, సూచనలు, విద్యార్థుల అభ్యున్నతి తదితర అంశాలపై చర్చించారు. విద్యార్థుల హాజరు శాతం,మెరుగుదల కోసం ఎఫ్ఆర్ఎస్ ప్రారంభించారని, దీని ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ రూపంలో సమాచారం తెలియజేయడం జరుగుతుందని ప్రిన్స్ పాల్ తెలిపారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణ,ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ ద్వారా జేఈఈ మెయిన్స్,నీటి కోచింగ్ క్లాసుల నిర్వహణ కళాశాలలో విద్యార్థులకు జరుగుతున్న తెలిపారు. క్లాసులు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి స్పోర్ట్స్ కేటాయించిన నిధులు, మరమ్మతులకు వచ్చిన అమ్మ ఆదర్శ కళాశాల కమిటీచే వచ్చిన నిధుల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. కళాశాలలో జరిగే తరగతుల పనితీరు, అధ్యాపకుల యొక్క అంకిత భావం,విద్యార్థుల పట్టుదల కృషి వారు చూపుతున్న శ్రద్ధ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కళాశాల కమిటీ గౌరవ అధ్యక్షుడు చింతలపల్లి మలహల్ రావు, చైర్ పర్సన్ చిగిరి మీనా,సభ్యులు వెంకటేష్,అధ్యాపకులు కళాశాల సిబ్బంది,తల్లిదండ్రులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
వందశాతం ఉత్తీర్ణతయే లక్ష్యం.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES