- Advertisement -
మ్యూజియం సందర్శన పుస్తకంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి బేబీ సంతకం
బీజింగ్ : చైనా కమ్యూ నిస్టు పార్టీ (సీపీసీ) అంతర్జాతీయ విభాగ ఆహ్వానం మేరకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం చైనాలో పర్యటిస్తోంది. వారం రోజుల సందర్శనలో భాగంగా అక్కడి సీపీసీ నేతలతో భేటీలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా.. సీపీఐ(ఎం) ప్రతినిధి బృందం కామ్రేడ్ మావో జెడాంగ్ సమాధి వద్ద నివాళులర్పించింది. సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి బేబీ మ్యూజియంలో ఉన్న సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా మావో జెడాంగ్ కమ్యూనిస్టు ఉద్యమానికి చేసిన సేవలను ప్రశంసించారు.
- Advertisement -