Saturday, September 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకవ్వాల్‌ అడవుల్లో అక్రమంగా వేసిన గుడిసెల తొలగింపు

కవ్వాల్‌ అడవుల్లో అక్రమంగా వేసిన గుడిసెల తొలగింపు

- Advertisement -

భారీగా మోహరించిన అటవీ అధికారులు, పోలీసులు ముందుగానే వెళ్లిపోయిన గిరిజనులు

నవతెలంగాణ-జన్నారం
ఆసిఫాబాద్‌ జిల్లా జన్నారం మండలం ఇంధన్‌పల్లి అటవీ రేంజ్‌ కవ్వాల్‌ అటవీ సెక్షన్‌ పరిధిలోని పాలగోరి అడవుల్లో అక్రమంగా వేసిన గుడిసెలను అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తొలగిం చారు. శుక్రవారం తెల్లవారుజామునే పోలీసులు, అటవీ అధికారులు మొత్తం 200 మందికిపైగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. అక్కడ ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌, నార్నూర్‌ మండలాలకు చెందిన గిరిజనులు విలువైన టేకు చెట్లను నరికి ఆ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేయడం సరికాదని, విలువైన టేకు చెట్లను నరికితే చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయని జన్నారం ఎఫ్‌డీఓ రామ్మోహన్‌ హెచ్చరించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా కలిసి వెళ్లేలోపే అక్కడున్న ఆయా మండలాల గిరిజనులు ముందుగానే వెళ్లిపోయారు. పోలీస్‌, అటవీశాఖ అధికారులు కలిసి గిరిజనులు వేసిన గుడిసెలను పూర్తిగా తొలగించారు. ఈ కార్యక్రమంలో ఇంధన్‌పల్లి ఎఫ్‌ఆర్‌ఓ శ్రీధర్‌ చారి, జన్నారం ఇన్‌చార్జి తహ సీల్దార్‌ సుష్మారావు, ఎస్‌ఐ గొల్లపల్లి అనూష, దండేపల్లి ఎస్‌ఐ తహసీ నుద్దీన్‌, అటవీశాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -