Saturday, September 27, 2025
E-PAPER
Homeసినిమాదర్శకుడు వైవీఎస్‌ చౌదరికి మాతృవియోగం

దర్శకుడు వైవీఎస్‌ చౌదరికి మాతృవియోగం

- Advertisement -

దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి రత్నకుమారి (88) కన్నుమూశారు. గురువారం సాయంత్రం తన తల్లి తుదిశ్వాస విడిచి నట్లు వైవీఎస్‌ చౌదరి తెలిపారు.అమ్మతో తనకి ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసు కుంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ నోట్‌ని విడుదల చేశారు.’లారీ డ్రైవర్‌ అయిన మా నాన్న యలమంచిలి నారాయణరావు నెలవారీ సంపాదనతో అమ్మ మా ముగ్గురినీ పెంచి పెద్ద చేసింది. మాకు పౌష్టికా హారం, దుస్తులు, ఇంటి అద్దె, విద్య, వైద్యంతోపాటు.. సినిమాలు చూపించడం నుంచి దేవాలయాల దర్శనాలు, సీజనల్‌ పిండి వంటలు, నిలవ పచ్చళ్ళు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్‌ వరకూ మొత్తం తన నోటి మీది లెక్కలతో బడ్టెట్‌ని కేటాయించేది. అలాంటి ఆర్థిక రంగ నిపుణురాలు మా అమ్మ. అన్నీ తానై మమ్మల్ని పెంచడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి. తన విధానాలతో మాలోనూ ఆ స్ఫూర్తిని నింపిన మహ నీయురాలు’ అని చౌదరి తన నోట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -